భూ వివాదం: పరస్పరం రాళ్లతో దాడికి దిగిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

Published : May 18, 2021, 02:10 PM IST
భూ వివాదం: పరస్పరం రాళ్లతో దాడికి దిగిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

సారాంశం

టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు పరస్పరం రాళ్ల దాడికి దిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది. 

కరీంనగర్:టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు పరస్పరం రాళ్ల దాడికి దిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని చామన్‌పల్లి గ్రామానికి చెందిన  ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మయ్య  అదే గ్రామ సర్పంచ్ మధ్య భూ వివాదం సాగుతోంది. కరీంనగర్ రూరల్ మండలం చామలపల్లికి చెందిన సర్పంచ్ భర్త ఎంపీటీసీ కొడుకుపై బండరాయితో దాడి చేశాడు.  నెల రోజులుగా ఈ భూమిపై వివాదం కొనసాగుతోంది.  ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.

ఈ వివాదం విషయమై ఇవాళ రెండు వర్గాల మధ్య  ఘర్షణ చోటు చేసుకొంది. రెండు వర్గాలు  ఎదురుపడి రాళ్లతో దాడికి దిగాయి. మరికొందరు ఈ రెండు వర్గాలను  నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ  ఎవరూ కూడ తగ్గలేదు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఒకే గ్రామానికి చెందినవారు  పరస్పరం దాడికి దిగడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఈ గొడవపై మరోసారి ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana