దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: ఈటలకి మంత్రి గంగుల సవాల్

Published : May 18, 2021, 12:28 PM IST
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: ఈటలకి మంత్రి గంగుల సవాల్

సారాంశం

దమ్ముంటే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని  మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 

కరీంనగర్: దమ్ముంటే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని  మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన సవాల్ విసిరారు.  అన్నీ పరిశీలించిన తర్వాతే ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారన్నారు. ఈటల తప్పు చేసినట్టుగా ఆధారాలున్నాయని ఆయన గుర్తు చేశారు. 

also read:హుజూరాబాద్‌లో ఎన్నికలు జరిగితే ప్రజలంతా అండగా ఉంటారు: గంగులపై ఫైర్

క్వారీలపై సీఎం కేసీఆర్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఇప్పటికే క్వారీలు నడుస్తున్నాయన్నారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కయ్యారా అని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములు కొన్నట్టుగా ఈటల ఒప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు. బెదిరిస్తే భయపడేవారెవరూ లేరన్నారు. తాను కూడ బీసీ బిడ్డనే అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. తాను భయపడనని ఆయన చెప్పారు.బిడ్డా... అని మాట్లాడితే అంతకంటే ఎక్కువ మాట్లాడుతామని గంగుల కమలాకర్ ఈటల రాజేందర్ ను హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?