జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలి: కేసీఆర్ ను కోరిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు

Published : Sep 09, 2022, 10:35 AM IST
జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలి: కేసీఆర్ ను కోరిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు

సారాంశం

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కోరారు. ఈ మేరకు హైద్రాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ  కోరారు.

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో కి కేసీఆర్ రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు.జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు గాను  జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో  పలు జిల్లాల పార్టీ అధ్యక్షులతో కలిసి  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ శక్తి కోసం భారత దేశ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను బీజేపీ  దోచి పెడుతుందని బాల్క సుమన్ ఆరోపంచారు.

దేశంలో మత విద్వేషాలను బీజేపీ రగిలిస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరహలో పోరాటం  నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఏ తరహలోనే మీ వెంట ఉన్నామో దేశ రాజకీయాల్లోకి  కేసీఆర్ వెళ్తే తామంతా కూడా ఆయన వెంట నడుస్తామని ఆయన  చెప్పారు. 

also read:త్వరలోనే జాతీయ పార్టీ: హైద్రాబాద్ వేదికగానే పార్టీ పేరును ప్రకటించనున్న కేసీఆర్

ఇవాళ అందుబాటులో ఉన్న నేతలంతా హైద్రాబాద్ లో సమావేశంలో పాల్గొన్నట్టుగా చెప్పారు. హైద్రాబాద్  సమావేశానికి రాని పార్టీ అధ్యక్షులతో కూడా తాము ఫోన్ లో మాట్లాడినట్టుగా  బాల్క సుమన్ చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?