
హైదరాబాద్ : 301 కోట్ల ఆస్తులతో భారతదేశంలోనే richest regional partyల్లో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంది. రూ.188 కోట్ల ఆస్తులతో తెలుగుదేశం నాలుగో స్థానంలో నిలవగా, వైఎస్సార్‌సీపీకి రూ.143 కోట్ల ఆస్తులున్నాయి.
election reforms అడ్వకేసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. 2019-2020కి సంబంధించి రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ డేటా రూపొందించబడింది.
ADR ప్రకారం. ఆస్తులు ఆరు ప్రధాన హెడ్‌ల కిందకు వస్తాయి : స్థిర ఆస్తులు, రుణాలు, అడ్వాన్సులు, FDR / డిపాజిట్లు, TDS, పెట్టుబడులు, ఇతరాలు.
దేశంలోని 44 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో టాప్ 10 పార్టీల ఆస్తుల విలువ రూ.2028.715 కోట్లు. ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆస్తుల విలువ రూ. 563.47 కోట్లు కాగా, టీఆర్‌ఎస్ రూ. 301.47 కోట్లు, ఏఐఏడీఎంకే రూ. 267.61 కోట్లుగా ఉన్నాయి.
టీడీ అత్యధికంగా రూ. 30.342 కోట్ల రుణాలను ప్రకటించగా, డీఎంకే రూ. 8.05 కోట్లు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కు రూ.4.41 కోట్ల అప్పులు ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలు తమ మూలధనం, రిజర్వ్ నిధులను కూడా ప్రకటించాయి. దీని ప్రకారం టీఆర్‌ఎస్‌కు రూ.297.06 కోట్లు, టీడీపీకి రూ.157.84 కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.143.31 కోట్ల మూలధనం, రిజర్వ్ నిధులు ఉన్నాయి.
రుణాలు తీసుకున్న ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లేదా ఏజెన్సీల వివరాలను ప్రకటించాలని పార్టీలకు సూచించే ICAI మార్గదర్శకాలను పాటించడంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయని కూడా ఇందులో తేలింది. సంవత్సరం లోగా... 1-5 సంవత్సరాలు... లేదా ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన గడువు తేదీ ఆధారంగా పార్టీలు "టర్మ్ లోన్‌ల రీపేమెంట్ నిబంధనలను" పేర్కొనాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.
ఇక ఎడిఆర్ ప్రకారం.. జాతీయ పార్టీలలో, బిజెపి రూ. 4,847.78 కోట్ల ఆస్తులను ప్రకటించింది, ఇది అన్ని రాజకీయ పార్టీల కంటే అత్యధికం. బిఎస్‌పి రూ. 698.33 కోట్లు, కాంగ్రెస్ రూ. 588.16 కోట్లు. మొత్తంగా చూస్తే ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు మొత్తం రూ.6,988.57 కోట్లు, కాగా 44 ప్రాంతీయ పార్టీలు రూ.2,129.38 కోట్లుగా ఉన్నాయి.