‘దొంగ’ అనే ముద్ర వేశారని ఉద్యోగి ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి...

Published : Jan 29, 2022, 08:01 AM IST
‘దొంగ’ అనే ముద్ర వేశారని ఉద్యోగి ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి...

సారాంశం

గదిలోని పుస్తకంలో ‘సంతోష్ సార్.. హబ్ లో కనిపించిన రూ. 2 లక్షల విషయంలో దొంగ ముద్ర వేశాడు. నేను భరించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఐయామ్ సారీ సర్, యువర్స్ సిన్సియర్లీ బి.శివరాం అంటూ ఒక పేజీలో... మరో పేజీలో ఈ సారి  భార్యకు రాస్తూ... పోయిన డబ్బులో తాను రూపాయి కూడా తినలేదని.. తనను తప్పు పట్టవద్దని, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను క్షమించాలని... కన్నయ్య జాగ్రత్త నన్ను క్షమించు’ అంటూ రాసిన లేఖలను పోలీసులు గుర్తించారు  

జూబ్లీహిల్స్ : తనకు సంబంధం లేని వ్యవహారంలో ‘thief’ అంటూ ముద్ర వేశారని.. మనస్థాపంతో లేఖ రాసి ఓ ఉద్యోగి suicideకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్ లోని దీన్ దయాళ్ నగర్ లో నివసించే బొల్లం శివరాం (30) 3 నెలల క్రితం మణికొండలోని Geo Mart Store లో చేరాడు. వారం రోజులుగా స్థిమితంగా లేకపోవడంతో భార్య మీనాక్షి ప్రశ్నించగా.. పని ఒత్తిడితో అలా ఉన్నట్లు తెలిపాడు. 

గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. భార్య ఓ Function కోసం మేడ్చల్ వెళ్లింది. శివరాం మధ్యాహ్నం ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. సాయంత్రం 5.30 ప్రాంతంలో తండ్రి జంగయ్య కుమారుడిని పిలిచేందుకు వెళ్లి.. పిలవగా ఎంతకీ తలుపు తీయలేదు. తలుపులు పగులగొట్టి చూస్తే ఉరేసుకుని కనిపించాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు నిర్థారించారు. 

గదిలోని పుస్తకంలో ‘సంతోష్ సార్.. హబ్ లో కనిపించిన రూ. 2 లక్షల విషయంలో దొంగ ముద్ర వేశాడు. నేను భరించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఐయామ్ సారీ సర్, యువర్స్ సిన్సియర్లీ బి.శివరాం అంటూ ఒక పేజీలో... మరో పేజీలో ఈ సారి  భార్యకు రాస్తూ... పోయిన డబ్బులో తాను రూపాయి కూడా తినలేదని.. తనను తప్పు పట్టవద్దని, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను క్షమించాలని... కన్నయ్య జాగ్రత్త నన్ను క్షమించు’ అంటూ రాసిన లేఖలను పోలీసులు గుర్తించారు. సంతోష్ మీద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 10న ఏపీలోని విజయవాడలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తన చావుకు నగర పంచాయతీ కమిషనర్ కారణం అంటూ సూసైడ్ నోటు, వాయిస్ రికార్డింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్లో, హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న, K చెన్నకేశవులు అనే వ్యక్తిని, చీమకుర్తి నూతన కమిషనర్ వెంకటరాంరెడ్డి ‘నీవు దళితుడవి నీకు ఉద్యోగం ఎందుకురా’ అని దుర్భాషలాడి కొంత కాలంగా విధుల నుండి తొలగించినందుకు మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి, వాయిస్ మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. 

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన చెన్నకేశవ స్థానిక వైద్యశాలకు తరలించారు. కమిషనర్ వ్యవహార శైలి మొదట నుండి కూడా విమర్శనాత్మకంగానే ఉంది. విధుల్లో చేరిన వెంటనే నలుగురు ఉద్యోగులను తొలగించడం, మేనేజర్ చేత బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించడం వంటివి చేశాడు. స్థానిక రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని స్థానికులు గుసగుసలాడుకుంటన్నారు.

కాగా, నిరుడు డిసెంబర్ 20న తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించి చివరికి తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తుంది.

చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన11వ తరగతి student కొద్ది రోజుల క్రితం అదృశ్యం అయింది. తాజాగా పోలీసులు ఆమె dead bodyన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఓ Suicide noteను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ లేఖలో ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళలకు సురక్షితమైన ప్రదేశాలు’ అని ఆమె రాసుకొచ్చింది.

అయితే, తన కుమార్తె 9వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిందని.. ఆ స్కూల్ లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది. ఈ కారణంగానే ఇప్పుడు మరో పాఠశాలలో చేర్పించినట్లు వివరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu