కరెంట్‌పై రోజుకు నాలుగుసార్లు సమీక్ష...అందువల్లే సాధ్యమయ్యింది: కేసీఆర్ (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 3, 2018, 4:27 PM IST
Highlights

ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు ప్రజలు గెలవాలి...వారి అభీష్టం గెలవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఓటు ఒకసారి చేయి జారిపోతే మన చేతుల్లో ఏమీ ఉండదని...కాబట్టి ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ హుజుర్ నగర్ ప్రజలకు సూచించారు. ఇవాళ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ ప్రసంగించారు.   

ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు ప్రజలు గెలవాలి...వారి అభీష్టం గెలవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఓటు ఒకసారి చేయి జారిపోతే మన చేతుల్లో ఏమీ ఉండదని...కాబట్టి ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ హుజుర్ నగర్ ప్రజలకు సూచించారు. ఇవాళ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ ప్రసంగించారు.   

ఇప్పటివరకు రాష్ట్రాన్ని కాంగ్రెస్, టిడిపిలే 58 ఏళ్ళు పాలించాయని...టీఆర్ఎస్ కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే పాలించిందన్నారు. ఇలా దశాబ్దాలు పాలించిన పార్టీలు ఓ వైపు, కొన్ని సంవత్సరాలు మాత్రమే పాలించిన పార్టీ మరోవైపు ఉంది. ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమోషన్ తో కాకుండా ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ సూచించారు.   

తెలంగాకు కరెంట్ కష్టాలు పోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో పనిచేసిందని కేసీఆర్ వివరించారు. ఇప్పటికీ కరెంట్ గురిచి రోజుకు నాలుగు సార్లు సమీక్ష నిర్వహించి మానిటర్ చేస్తానని వెల్లడించారు. అందువల్లే నాణ్యతతో కూడిన 24  గంటల విద్యుత్ ప్రజలకు అందించగలుగుతున్నామని కేసీఆర్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీలో డిల్లీ నుండి ఇక్కడి వరకు అందరూ ఘనాపాటిలే ఉన్నారని  కేసీఆర్ ఎద్దేవా చేశారు. వారిలో నా కంటే లావుగా, పొడుగ్గా చాలా మంది వున్నారు...అలాంటి వారు కూడా తమలాగా కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ ను నేనే కట్టానని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇలా కరెంట్ ఇవ్వలేదన్నారు. పేగులు తెగే వరకు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం... నిబద్దతలో అభివృద్ది చేయాలని కోరిక ఉంది కాబట్టే తమకు ఇది సాధ్యమైందని కేసీఆర్ తెలిపారు.  

తెలంగాణ రైతులకు ఏడాదికి ఎకరానికి 8 వేల రూపాయలు అందిస్తున్న బృహత్తర పథకం రైతు బందు. ఇలాంటిది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేదని ప్రశంసించారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా రైతు బంధు లాంటి పథకం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న ప్రభుత్వంలో రైతులకు ఎకరానికి 10 వేలు అందించనున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. 

రైతుల మధ్య భూముల పంచాయితీ పెట్టిన పార్టీలు కాంగ్రెస్,టిడిపిలని విమర్శించారు. కానీ మేము ఆ పంచాయితీలను తెంపి రైతులకు పట్టా పాస్ బుక్ లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

 మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే లాభమేమీ ఉండదన్నారు. ఈ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ లోనే ఓ రోజంతా ఉండి అవసరమైన అభివృద్ది పనుల గురించి ఆర్డర్లు ఇస్తానన్నారు. సైదిరెడ్డి మా ఇంటి మనిషి లెక్క కాబట్టి ఆయనను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. 

వీడియో

 


 

click me!