మాపై కోపమున్నా ఈ ఎన్నికల్లో చూపించకండి...: తుమ్మల

By Arun Kumar PFirst Published Dec 3, 2018, 3:36 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రముఖ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా వున్న నేపథ్యంలో ఒక్క ఓటును కూడా వదులుకోడానికి సిద్దంగా లేరు. పార్టీల్లోని ముఖ్య నాయకులు తమపై వ్యతిరేకత వున్న వర్గాలను కూడా బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ విధంగా అశ్వారావుపేట ప్రజలను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుజ్జగించే పనిలో పడ్డారు. 
 
అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ....'' నాపై, ఎమ్మెల్యే అభర్థి తాటిపై, ఎంపీ పొంగులేటిపై కోపం, అసహనం వున్నా ఎన్నికల తర్వాత చూపించాలన్నారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా ఆ కోపాన్ని ప్రదర్శించొద్దని...టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నాక కూర్చుని మాట్లాడుకుందాం'' అంటే తుమ్మల  వ్యతిరేక వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

జిల్లా ప్రజల కోసం తన 32 ఏళ్ల రాజకీయ జీవితాన్ని త్యాగం చేసినట్లు తుమ్మల తెలిపారు. కాబట్టి నాకోసమైనా తాటి వెంకటేశ్వర్లును గెలిపించాలని ప్రజలకు సూచించారు. భారీ మెజారిటీతో కాకున్నా ఐదు లేదా పదివేల మెజారిటోనైనా గెలిపించాలని తుమ్మల కోరారు. 

click me!