రసమయికి చేదు అనుభవం

By Nagaraju TFirst Published Oct 17, 2018, 9:09 PM IST
Highlights

 తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇల్లదకుంట మండలం ముస్కానిపేటలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రసమయి బాలకిషన్ ను ఆ గ్రామానికి చెందిన యువకులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. 
 

సిరిసిల్ల జిల్లా: తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇల్లదకుంట మండలం ముస్కానిపేటలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రసమయి బాలకిషన్ ను ఆ గ్రామానికి చెందిన యువకులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఇటీవల గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావ్ ఫూలే విగ్రహాల ఆవిష్కరణకు రావాల్సిందిగా గ్రామానికి చెందిన యువకులు రసమయిని కోరారు. అయితే రసమయి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో విగ్రహాల ఆవిష్కరణకు ఎందుకు రాలేదంటూ యువకులు నిలదీశారు. ఎన్నికల సమయంలోనే తాము గుర్తుకు వస్తామా అంటూ ప్రశ్నించారు. తమ ఊరికి రావొద్దని వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 

మరోవైపు రసమయి అనుచరులు యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా యువకులు వినలేదు. రసమయి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో చేసేది లేక రసమయి అక్కడ నుంచి నెమ్మదిగా వెనుదిరిగారు.  

click me!