ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంటా? లేక చప్రాసా:తలసాని

By Nagaraju TFirst Published Oct 17, 2018, 5:32 PM IST
Highlights

 కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ దిక్కుమాలిన పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఉత్తమ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంటా? లేక చప్రాసా అని సందేహం వ్యక్తం చేశారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ దిక్కుమాలిన పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఉత్తమ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంటా? లేక చప్రాసా అని సందేహం వ్యక్తం చేశారు. గతంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పుడు ఐదు వేలు పింఛన్ ఇస్తామన్నా నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడే గెలిచినట్లుగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్ నేతల్లా టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు అమ్ముకోలేదన్నారు. టీఎస్‌‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని తలసాని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. రాజీవ్‌ గృహ కల్ప పేరుతో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేసి ఏం చేయలేకపోయారని ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి పుట్టి పెరిగిన గ్రామాన్నే పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే సెటిలర్లను పొగడ్తున్నామనేది సరికాదన్నారు. 

నాలుగేళ్లుగా వారంతా హైదరాబాద్ అభివృద్ధి చూశారని అందువల్లే ఆంధ్రావాళ్లంతా టీఆర్ఎస్ వెంటే ఉంటారని తలసాని ధీమా వ్యక్తం చేశారు. సనత్‌నగర్‌లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసినా పోటీ చేసినా తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు.

click me!