Nalgonda Local body MLC Election: టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం

By narsimha lode  |  First Published Dec 14, 2021, 9:35 AM IST


తొలి ప్రాధాన్యత ఓట్లతో నల్గొండ  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గా కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి నగేష్ పై ఆయన గెలుపొందారు.


నల్గొండ:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి koti Reddy ఘన విజయం సాధించారు.ఈ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే Nagesh పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి నగేష్  పై టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్ధి ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1233 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 1183 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.  50 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అయితే ఈ ఎన్నికల్లో గెలవాలంటే 593 ఓట్లు అవసరం. టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్ధి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నగేష్ విపక్షాలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ  ఈ స్థానంలో అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. ఇతర పార్టీలు కూడా ఈ స్థానంలో అభ్యర్ధులను బరిలో దింపలేదు. విపక్షాల మద్దతు తనకు ఉంటుందని నగేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రకటించారు.

also read:Telangana MLC Election Result: దూసుకుపోతున్న కారు... ఖమ్మం, నల్గొండ లో ఎగిరిన టీఆర్ఎస్ జెండా... 

Latest Videos

undefined

రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రరెడ్డి, శంభీపూర్ రాజు, నిజామాబాద్ నుండి కవిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపును ఇవాళ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందో బస్తు  ఏర్పాటు చేశారు. 
ఆదిలాబాద్‌లో ఆరు, కరీంనగర్‌లో తొమ్మిది మిగతా జిల్లాల్లో  ఐదు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి కౌంటింగ్ చేస్తున్నారు. మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత ఓట్లను  లెక్కిస్తున్నారు.


 


 

click me!