హైద్రాబాద్ మాదాపూర్‌లో ఉద్రిక్తత: అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ రద్దు.. అభిమానుల ఆందోళన, లాఠీచార్జీ

Published : Dec 13, 2021, 08:15 PM IST
హైద్రాబాద్ మాదాపూర్‌లో ఉద్రిక్తత: అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ రద్దు.. అభిమానుల ఆందోళన, లాఠీచార్జీ

సారాంశం

సినీ నటుడు అల్లు అర్జున్ తో ఫోటో సెషన్ అంటూ అభిమానులకు  సమాచారం అందింది. అయితే ఈ కార్యక్రమం చివరి నిమిషంలో రద్దు కావడంతో అభిమానులు గేట్లు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.సినీ నటుడు Allu Arjun తో Photo సెషన్ చివరి నిమిషంలో రద్దు కావడంతో అభిమానులు రెచ్చిపోయారు. కన్వెన్షన్ సెంటర్  గేట్లు విరగ్గొట్టారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులపై police లాఠీచార్జీ చేశారు. పలువురికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.సినీ నటుడు అల్లు అర్జున్ తో  పోటో సెషన్ అంటూ అభిమానులకు మేసేజ్‌లు వెళ్లాయి. అంతేకాదు వారికి పాస్ లు కూడా జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా అభిమానులు హైద్రాబాద్ కు చేరుకొన్నారు.  అయితే ఈ కార్యక్రమం చివరి నిమిషంలో రద్దైంది. దీంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోకి అభిమానులు చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు విరగొట్టారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  అల్లు అర్జున్ అభిమానులపై లాఠీచార్జీకి దిగారు. అభిమానులను చెదరగొట్టారు. మరో వైపు తమపై బౌన్సర్లు కూడా దాడికి దిగారని అల్లు అర్జున్ అభిమానాులు ఆరోపించారు. ఫోటోలు దిగేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఇష్టమొచ్చినట్టుగా కొడతారా అని అభిమానులు మండిపడుతున్నారు.ఇలా చేయడం వల్ల  తమ హీరోకు చెడ్డ పేరు వస్తోందని  మరికొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu