దళిత బంధు ప్రారంభం రోజే కేటీఆర్ ఇలాకాలో ఉద్రిక్తత... టీఆర్ఎస్, బిజెపి శ్రేణులు భాహాభాహీ

By Arun Kumar PFirst Published Aug 16, 2021, 4:28 PM IST
Highlights

మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇవాళ టీఆర్ఎస్, బిజెపి శ్రేణులు భాహాభాహీకి దిగారు. దీంతో పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

సిరిసిల్ల: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం రోజునే మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్, బిజెపి శ్రేణులు భాహాభాహీకి దిగారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే...ఇవాళ(సోమవారం) హుజురాబాద్ లో దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఇలా ర్యాలీగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులకు బిజెపి నాయకులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు ఒక దశలో ఒకరిపైకి ఒకరు వెళ్లారు. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. 

read more  కాంట్రాక్టులు, దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు: హుజురాబాద్‌లో దళితబంధు‌ను ప్రారంభించిన కేసీఆర్

పరిస్థితి అదుపుతప్పేలా కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. ఈ క్రమంలోనే పలువురు బిజెపి నాయకులకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై వదిలేశారు. 

ఆదివారం మల్కాజిగిరిలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కార్పోరేటర్ పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ని హన్మంతరావు నోటికి వచ్చినట్లు తిట్టాడు. దీంతో బండి సంజయ్ పై వాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దహనం చేయడానికి బిజెపి నాయకులు అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా ర్యాలీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 


 

click me!