కాంట్రాక్టులు, దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు: హుజురాబాద్‌లో దళితబంధు‌ను ప్రారంభించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 16, 2021, 3:33 PM IST

హుజూరాబాద్ మండలం శాలపల్లిలో దళితబంధు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నాడు  నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ పథకం సరికొత్త చరిత్ర సృష్టిస్తోందన్నారు.



హుజూరాబాద్: షాపులు, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తు దళిత ఉద్యమానికి  హుజూరాబాద్ పునాదిరాయి వేయనుందన్నారు..హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు ఒక ప్రయోగశాలలాంటిదన్నారు.

సోమవారం నాడు హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం  సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Latest Videos

undefined

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. రైతు బంధు తరహాలోనే దళితబంధు నిధులు లబ్దిదారులకు అందుతాయన్నారు.దళితబంధు కచ్చితంగా విజయవంతం కానుందన్నారు. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఒక మహా ఉద్యమమని ఆయన చెప్పారు. వాక్‌శుద్ది, చిత్తశుద్ది, పట్టుదల ఉండాలన్నారు. 

దళితబంధు పథకం ఏడాది ముందే ప్రారంభించాలని భావించామన్నారు. కానీ కరోనా కారణంగా ఏడాది తర్వాత దళితబంధు పథకం ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల మంది దళిత కుటుంబాలు ఉన్నట్టుగా సమగ్రసర్వే రిపోర్టులో తేలిందన్నారు. వచ్చే నెల రెండు మాసాల్లో ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అందుతాయని ఆయన చెప్పారు. 

పేదలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టని పార్టీలు కూడా కిరికిరి పెడుతున్నాయన్నారు. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అపోహలు, అనుమానాలే కలుగుతున్నాయన్నారుతమ ప్రభుత్వం చేస్తున్న పనిని 75 ఏళ్ల క్రితమే మొదలు పెడితే ఈ దుస్తితి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి కుటుంబాలకు దళిత బంధు పథకం చివరి వరుసలో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 

లబ్దిదారులు తమకు నచ్చిన పనిని వచ్చిన పనిని చేసుకోవచ్చన్నారు. రూ. 10 లక్షలను సబ్సీడీ కింద ఇస్తామని చెప్పారు. బ్యాంకులతో ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుండి ఒత్తిడి ఉండదని ఆయన చెప్పారు.అనంతరం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం కింద లబ్దిదారులకు చెక్కులను అందించారు. 


 

click me!