
మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఈటల గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు. మునుగోడు మండలం పలివెలలో ఈ రాళ్లదాడి జరిగింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ జగదీశ్ సహా పలువురికి గాయాలయ్యాయి. రాళ్లదాడిలో ఈటల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.