ధర్మారెడ్డి ఇంటిపై దాడి: టీఆర్ఎస్ ప్రతీకారం.. వరంగల్ బీజేపీ కార్యాలయంపై ఎటాక్

By Siva KodatiFirst Published Jan 31, 2021, 8:54 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్ధితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నేతల దాడితో భగ్గుమన్న గులాబీ శ్రేణులు.. వరంగల్ అర్బన్ బీజేపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్ధితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నేతల దాడితో భగ్గుమన్న గులాబీ శ్రేణులు.. వరంగల్ అర్బన్ బీజేపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు.

అటు చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి  కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని ఆయన పేర్కొన్నారు.

Also Read:మాకు ఓపిక నశిస్తే.. మీరు బయట తిరగలేరు: బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్

తమ వాదనలతో ప్రజలను ఒప్పించడం చేతకాక ఇతరు పార్టీలపై భౌతికదాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కేటీఆర్‌ అన్నారు.

గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు యత్నించిందని గుర్తుచేశారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి బీజేపీ పదేపదే భౌతికదాడులకు దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

మా సహనానికీ ఓ హద్దు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ భౌతిక దాడుల్ని ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందని.. తమ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ శ్రేణులు బయటకు తిరగలేరని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్‌కు దాడికి తెగబడటం గమనార్హం. 

click me!