Jagajyothi: ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఏసీబీ(ACB) అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధించింది.
Jagajyothi: ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నా.. ఆ జీతం సరిపోనట్టు అవినీతి సోమ్ముకు అలవాటు పడుతున్నారు కొందరు అవినీతి అధికారులు. సందు దొరికితే చాలు.. అందిన కాడికి దోచుకోవడం పరిపాటిగా మార్చుకుంటున్నారు. చిన్న పనైనా సరే.. బల్ల కింద డబ్బుపెట్టనిదే పని జరగని దుస్థితి. లంచాలకు రుచి మరిగిన ఇలాంటి అధికారులు.. ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. తరచూ ఇలాంటి అవినీతి తిమింగలాలు ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు.
పేదలను పట్టి పీడిస్తున్న ఈ లంచావతారులను పట్టుకున్న మిగితా వారిలో మార్పు రావడం లేదు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న జగజ్యోతి (Jagajyothi) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. జగజ్యోతిని అరెస్ట్ చేసిన అధికారులు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీపీ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చి 6 వరకు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించాలని సూచింది.
అసలేం జరిగింది?
నిజామాబాద్ కు చెందిన కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేల లంచం తీసుకుంటూ ట్రైబర్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి (Jagajyothi)రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తర్వాత అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో విస్మయపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంట్లో .65 లక్షల నగదు, 3.6 కిలోల బంగారం ను అధికారులు గుర్తించారు. అలాగే స్థిరాస్థి పత్రాలు ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జగజ్యోతికి ఆస్తులు ఉన్నాయని అధికారులు తెలుసుకున్నారు. ఓ ఎస్ఈ స్థాయి మహిళా అధికారి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం, ఆస్తి పత్రాలు లభ్యమవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.