రాజాసింగ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ...

By Arun Kumar PFirst Published Nov 20, 2018, 4:58 PM IST
Highlights

హైదరాబాద్‌లో బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓ ట్రాన్స్ జెండర్ పోటీకి దిగింది. సీపిఎం నేతృత్వంలోని బహుజన లెప్ట్ ఫ్రంట్ టికెట్ పై చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ ను గోషామహల్ నుండి బరిలోకి దింపింది. దీంతో ఇప్పటికే ఇక్కడ బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ల మధ్య రసవత్తర పోటీ ఖాయమైన నేపథ్యంలో ఈమె రాకతో గోషామహల్ పై మరింత ఆసక్తి పెరిగింది. 
 
తనకు ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని అన్ని ముఖ్య పార్టీలని కోరినట్లు చంద్రముఖి(32) తెలిపారు. అయితే అందరు తిరస్కరించినా చివరకు బీఎల్ఎఫ్ తనకు అవకాశం కల్పించిందన్నారు. బీఎల్ఎఫ్ భీపారంపై ఆమె నామినేషన్ వేసినట్లు తెలిపిన ఆమె...ఈ  అవకాశం కల్పించిన సీపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చంద్రముఖి తెలిపారు.

గోషామహల్ లో అధికంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వ్యాపారవేత్తలే ఉన్నారని...వారికి ట్రాన్స్ జెండర్స్ సమస్యల గురించి తెలుసని అన్నారు. కాబట్టి వారందరు తనకే  ఓటేస్తారని భావిస్తున్నట్లు చంద్రముఖి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ట్రాన్స్ జెండర్స్ సమస్యలతో పాటు బాల కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.    

సంబంధిత వార్తలు

గోషామహల్ లో ట్రాన్స్ జెండర్ చంద్రముఖి ప్రచారం (ఫొటోలు)

గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి
 
click me!
Last Updated Nov 20, 2018, 5:19 PM IST
click me!