ఆర్టీసి సమ్మె: సాయంత్రం ఆరు లోపల రాకపోతే కార్మికులకు ఉద్వాసనే

By telugu teamFirst Published Oct 5, 2019, 6:57 AM IST
Highlights

సమ్మెకు దిగిన టీఎస్ఆర్టీసి కార్మికులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. సాయంత్రం ఆరు లోపల రిపోర్టు చేయనివారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలుండవని స్పష్టం చేశారు.

హైదరాబాద్: సమ్మెకు దిగిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసి) ఉద్యోగులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపల రిపోర్టు చేయని ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చారు. అజయ్ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 

మూడు రోజుల పాటు త్రి సభ్య కమిటి సభ్యులు ఆర్టీసీ కార్మికులతో చర్చించారని, కమిటి చర్చల ఫలితాలను సీయంకు వివరించారని,కార్మికులు చట్టం బద్దం కాని సమ్మెలోకి వెళ్తున్నారని ఆయన అన్నారు. సమ్మెపై నిషేధం, ఎస్మా అమల్లో ఉన్న సమయంలోనే కాకుండా కార్మిక శాఖ ఆద్వర్యంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ‌ సమ్మె చట్ట బద్దం కాదని ఆయన అన్నారు.కమిటి సమయం కోరింది కాని యూనియన్ నాయకులు కార్మికుల జీవితాలని ఆయోమయంలోకి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. 

త్రి సభ్య కమిటి పని‌ పూర్తి అయిందని,  ప్రభుత్వం త్రి సభ్య కమిటిని ఉపసంహరించుకుందని అజయ్ చెప్పారు. ఇక మీదట యూనియన్ నాయకులతో చర్చలు ఉండవని చెప్పారు. పండగ సమయంలో సమ్మెకు వెళ్లడం బాద్యాతారాహిత్యమేనని అన్నారు. విదుల్లో చేరే వారికి రక్షణ కల్పించాలని డీజీపిని‌ కోరినట్లు మంత్రి తెలిపారు. మూడు వేల మంది డ్రైవర్ల నుండి అప్లికేషన్లు వచ్చాయని ఆర్టీసి ఎండి సునీల్ శర్మ చెప్పారు. స్కూల్ బస్ లు 1500 అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు.  కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్రలతో మాట్లాడామని, వారు కూడా సర్వీస్ లు పెంచుతమన్నారని, వారికి రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు ఉంటాయని, 

విదుల్లో చేరే వారికి పూర్తి రక్షణ ఉంటుందని సునీల్ శర్మ చెప్పారు. ఎక్కువ చార్జీలు వసూలు చేయవద్దని ప్రైవెట్ ట్రావెల్స్ కు సూచించామని ఆయన అన్నారు.మెట్రో రైలు అదికారులతో మాట్లాడామని, ప్రతి మూడు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతారని అన్నారు. స్కూల్ బస్ లలో ఫిట్నస్ చెక్ చేసాము కాబట్టి అవి బాగా‌ నడుస్తాయని అన్నారు.

click me!