శ్రీరామనవమి నాడు విషాదం.. గుడిలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు చిన్నారులు మృతి...

Published : Apr 11, 2022, 11:08 AM IST
శ్రీరామనవమి నాడు విషాదం.. గుడిలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు చిన్నారులు మృతి...

సారాంశం

ఖమ్మం జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. మితిమీరిన వేగం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. బొలెరో వాహనం అదుపుతప్పి గుడిలోకి దూసుకురావడంతో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు గాయాలై, ప్రాణాలు కోల్పోయారు. 

ఖమ్మం :  పండుగపూట విషాదం నెలకొంది templeలోకి బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.  ఈ ఘటన khammam జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటుచేసిన విభజనకు తుమ్మల పల్లికి చెందిన 25 మంది వచ్చారు.  కొందరు పిల్లలను వెంటబెట్టుకు వచ్చారు. పెద్దలు  భజన చేస్తుండగా పిల్లలు ఆడుకుంటున్నారు. 

రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్లున్న Bolero ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదే వేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గోడ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్ర గాయాలైన చిన్నారులను ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా దేదీప్య సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయటపడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు.

తీరని శోకం…
తుమ్మలపల్లికి  చెందిన పగడాల అది నారాయణ, శిరీష దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్ గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెల్తుంటాడు. పల్లిపాడులో భజనకు భార్యభర్తలు వెడుతూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంపతుల దు:ఖనికి అంతులేకుండా పోయింది. 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లో కూడా శ్రీరామనవమి వేడుకల్లోఅపశృతులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల వాహనాలు, ఇల్లు దగ్థమయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో Curfew విధించినట్టు సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు. నగరంలో ఎక్కువ మంది గుమిగూడే సమావేశాలు, సభలను నిషేధించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

రామ జన్మదినం, కల్యాణం జరుపుకునే పండుగరోజైన రామ నవమిని పురస్కరించుకుని ఊరేగింపు చేస్తున్న క్రమంలో ఘర్షణలు చెలరేగాయి. "రామ నవమి ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం నుండి ప్రారంభమైనప్పుడు, ర్యాలీపై రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఖర్గోన్ నగరంలో మొత్తం ఊరేగింపు జరగాల్సి ఉండగా.. హింస కారణంగా ఉరేగింపు మధ్యలోనే ఆగిపోయింది’ అని అదనపు కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ ముజల్దే అన్నారు.

ఊరేగింపులో లౌడ్ స్పీకర్ల పెట్టి పాటలు పెట్టడంతో.. స్థానిక నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినకపోవడంతో.. రాళ్లు విసిరారని ఆరోపణలు వచ్చాయి. ఊరేగింపు ముస్లింలు నివసించే ప్రాంతం మీదుగా వెడుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని ప్రాథమిక సమాచారం. గొడవకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
గొడవ క్రమంలో యువకులు వాహనాలకు నిప్పు పెట్టడం, కొందరు యువకులు రాళ్లు రువ్వడం, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దాడిలో పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. చౌదరి కాళ్లపై రాయితో కొట్టడంతో.. కాలుకి తీవ్ర రక్తస్రావమై స్ట్రెచర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా కనిపించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu