భారత్ జోడో యాత్ర:సైబరాబాద్‌లో నేటి నుండి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

By narsimha lode  |  First Published Oct 30, 2022, 3:05 PM IST

భారత్  జోడో యాత్రను  పురస్కరించుకొని ఇవాళ్టి నుండి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు  పోలీసులు . సైబరాబాద్  కమిషనరేట్  పరిధిలో రాహుల్ పాదయాత్ర  ఈ  నాలుగు రోజులు సాగుతుంది.



హైదరాబాద్:భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఇవాళ్టి  నుండి నాలుగు రోజుల  పాటు సైబరాబాద్  పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు  పోలీసులు .ఇవాళ సాయంత్రానికి రాహుల్ గాంధీ  భారత్ జోడో  యాత్ర షాద్ నగర్  మండలంలోకి ప్రవేశిస్తుంది.  దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను  విధించారు. 

ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు షాద్  నగర్  లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు శంషాబాద్  పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి.  మధ్యాహ్నం మూడు గంటల  నుండి  రాత్రి  ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను  విధించారు.నవంబర్ 1న ఉదయం  ఆరు  గంటల రాత్రి 10 గంటల  వరకు వాహాలను  మళ్లించనున్నారు. నవంబర్  2న బాలానగర్  పోలీస్  స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని  పోలీసులు  వివరించారు.

Latest Videos

undefined

ట్రాఫిక్ ఆంక్షల  నేపథ్యంలో  వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను   చూసుకోవాలని  పోలీసులు కోరారు.  రాహలు్  గాంధీ  తెలంగాణ  రాష్ట్రంలో  పాదయాత్ర ఐదు రోజులుగా సాగుతుంది. ఇవాళ ఉదయం జడ్చర్ల మండలం నుండి  పాదయాత్ర  ప్రారంభమైంది.. షాద్ నగర్  మండలం సోలీపూర్ జంక్షన్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర  నిర్వహిస్తారు.  ఈ నెల  23న కర్ణాటక  రాష్ట్రం  నుండి పాదయాత్ర  తెలంగాణ రాష్ట్రంలోకి  ప్రవేశించింది. అదే రోజు నాలుగు కి.మీ పాదయాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ  దీపావళిని  పురస్కరించుకొని యాత్రకు  మూడు రోజులు  బ్రేక్  ఇచ్చారు. ఈ నెల  24, 25, 26 తేదీల్లో యాత్రకు  విరామం ప్రకటించారు.ఈ 27  నుండి రాహుల్ గాంధీ తన పాదయాత్రను  పున: ప్రారంభించారు.

also read:తెలంగాణ రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తుంది: రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న జానారెడ్డి

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ  తేదీన తమిళనాడు  రాష్ట్రంలోని  కన్యాకుమారిలో రాహుల్ గాంధీ  పాదయాత్రను  ప్రారంభించారు. తమిళనాడు,కేరళ , ఏపీ ,కర్ణాటక రాష్ట్రాల మీదుగా  తెలంగాణ రాష్ట్రంలోకి  రాహుల్  గాంధీ పాదయాత్ర  ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్రంలో  15  రోజుల పాటు   పాదయాత్ర  సాగుతుంది. తెలంగాణ  నుండి  మహారాష్ట్రలో  రాహుల్  గాంధీ పాదయాత్ర  ప్రవేశించనుంది.

click me!