దమ్ముంటే బడ్జెట్‌పై నాతో చర్చించండి? సీఎం, హరీష్‌లకు ఈటల సవాల్.. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు

By Mahesh KFirst Published Mar 17, 2022, 1:38 PM IST
Highlights

బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, గవర్న్రర్ ప్రసంగాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ప్రజాస్వామ్య పరిరక్ష దీక్ష చేపడుతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర చేపడుతున్న ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, దమ్ముంటే బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులకు సవాల్ విసిరారు.
 

హైదరాబాద్: అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపైనా మండిపడ్డారు.

బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో మొదలుపెడతారని, కానీ, ఇక్కడ కేసీఆర్ గవర్నర్ ప్రసంగమే లేకుండా చేశారని ఈటల ఫైర్ అయ్యారు. ఈ సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగంపైనా చర్చ జరుగుతుందని తెలిపారు. కానీ, అదీ లేకుండా చేసిన సీఎం కేసీఆరేనని చెప్పారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని లేకుండా చేయడమే కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలనూ సస్పెండ్ చేయడానికి సీఎం కేసీఆరే సభాపతికి స్లిప్పులు ఇచ్చారని అన్నారు. సీఎం ఇచ్చిన స్లిప్పులతోనే సభాపతి తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు.

Latest Videos

ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కోసారి బడ్జెట్ సమావేశాలు 30 నుంచి 45 రోజులు నిర్వహించిన చరిత్ర ఉన్నదని, అలాంటిది ఇక్కడ కనీసం 30 రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదని ఈటల మండిపడ్డారు. వారం రోజులు సమావేశాలు జరిగి.. బడ్జెట్ సమావేశాలు ముగిశాయని సీఎం కేసీఆర్ హుకూం జారీ చేశారని తెలిపారు. కుట్రతోనే కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు పంపించారని అన్నారు. తనతో బడ్జెట్‌పై చరర్చించడానికి సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది కావొచ్చు.. కేంద్రంలో మన సర్కారే ఉన్నదని తెలిపారు. ఈ ప్రభుత్వం నకిలీ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నదని, కానీ, బండి సంజయ్ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారని వివరించారు. తెలంగాణపై కేంద్ర బృందం నజర్ ఉన్నదని, అమిత్ షా తెలంగాణపై ఫోకస్ పెట్టారని తెలిపారు.

మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రజాస్వామ్య బద్దంగా నల్లకండువాలు వేసుకుని నిరసనలు చేశామని, సభాపతి కుర్చీలో కూర్చోగానే.. గవర్నర్ ప్రసంగం లేనందును ఒక మూడు నిమిషాలు తమకు సమయం కేటాయించాలని కోరామని చెప్పారు. కానీ, ఆయన అదేమీ పట్టించుకోకుండా బడ్జెట్ ప్రసంగం చేయడానికి హరీష్ రావును కోరారని పేర్కొన్నారు.

click me!