పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..

By Asianet News  |  First Published Oct 28, 2023, 7:34 AM IST

ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై నుంచి ట్రాక్టర్ ను నడిపాడు. కానీ అది పట్టాలపైనే ఇరుక్కుపోయింది. అయితే అదే సమయంలో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు ఆ ట్రాక్ గుండా ప్రయాణించాల్సి ఉంది. దీనిని గుర్తించిన అధికారులు ఆ రైలును ముందు స్టేషన్ లోనే నిలిపి ఉంచారు. దీంతో ఆ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది.


గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. రైల్వే అధికారుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం జరగకుండా ఆగిపోయింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

దారుణం.. వివాహితను 20 రోజులు గదిలో బంధించి వాలంటీర్ అత్యాచారం..

Latest Videos

మాడ్గులపల్లి మండలంలోని చెర్వుపల్లి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ ట్రాక్ వెంట పలు ముఖ్యమైన రైళ్లు ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే స్థానిక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్ ను చెర్వుపల్లి సమీపంలోని ట్రాక్ పై అడ్డంగా నడిపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీ ట్రాక్ పై ఇరుక్కుపోయింది. డ్రైవర్ ట్రాక్టర్ ను అక్కడి నుంచి తీసేందుకు ఎంతగానే ప్రయత్నించాడు. కానీ ఇంజిన్, ట్రాలీని కలిసేఓ భాగం ట్రాక్ లలో చిక్కుకుపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి, 26 మందికి గాయాలు

దీనిని పలువురు స్థానికులు గమనించారు. వెంటనే రైల్వే సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అలెర్ట్ అయ్యారు. ఆ సమయంలో ఆ ట్రాక్ పై గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే పల్నాడు ఎక్స్ ప్రెస్ వెళ్తోందని గుర్తించారు. ట్రాక్టర్ ట్రాక్ పై ఇరుక్కున్న ప్రాంతానికి ముందు ఉన్న కుక్కడం రైల్వే స్టేషన్ కు సిబ్బంది ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అక్కడి సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ట్రైన్ ను ఆ స్టేషన్ లోనే అరగంట సేపు నిలిపి ఉంచారు.

ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఫొటోలు ఉంచుకోవడం ఉగ్రవాద చర్య కాదు.. - మద్రాస్ హైకోర్టు

తరువాత ఓ జేసీబీని ఘటనా స్థలానికి తీసుకువచ్చి, దాని సాయంతో ట్రాక్టర్ ను ట్రాక్ పై నుంచి తొలగించారు. రైలుకు ట్రాక్ ను క్లియర్ చేశారు. దీని వల్ల రైలు అరగంట లేటుగా ప్రయాణం ప్రారంభించింది. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ పై ట్రాక్టర్ ను నడిపిన డ్రైవర్ పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!