అక్రమ సంబంధం మోజులో రెండు హత్యలు చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరించిన వైనం

By Rajesh Karampoori  |  First Published Oct 28, 2023, 7:16 AM IST

వివాహేతర సంబంధం తమ పచ్చిన సంసారంలో నిప్పులు పోసుకున్నారు. తమ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకున్నారు. ఈ క్రమంలో హత్యలు చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరించారు.  
 


వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. వేరే మహిళపై మనసు పడ్డ ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. అలాగే తన ప్రియురాలి భర్తను అడ్డు తొలిగించి ఆత్మహత్యగా నమ్మించబోయారు. కానీ కథ అడ్డం తిరిగి.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయట పడింది. చివరి జైలు పాలు కావాల్సివచ్చింది. తీరా వారి పిల్లలు అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన సూర్యపేటలో వెలుగు చూసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.

సూర్యపేట జిల్లా మోతె మండలం బళ్లుతండాకు చెందిన భూక్యా వెంకన్న తన కుటుంబంతో సూర్యాపేట భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నూతనకల్‌ మండలం ఎర్రపహాడ్‌ గ్రామానికి చెందిన షేక్‌ రఫీ తన కుటుంబంతో కలిసి పట్టణంలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వెంకన్నకు, షేక్‌ రఫీ భార్య నస్రీన్‌తో పరిచయం ఏర్పడింది.

Latest Videos

ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తామిద్దరం కలిసి జీవించాలని భావించారు.  అయితే.. వారికి తమ జీవిత భాగస్వాములు ఆటంకంగా మారారు.  దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని భావించారు.  ఈ క్రమంలో వెంకన్న కూర్రంగా ఆలోచించాడు. పథకం ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ 8 రాత్రి వెంకన్న తన భార్యను బైకు పై బళ్లుతండా నుంచి సూర్యాపేటకు తీసుకెళ్లాడు. కానీ, దారిలో బైకు ఆపి.. ఆమెను విద్యుత్తు స్తంభానికి కొట్టి హత్య చేశాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు చిత్రీకరించాడు.  ఇక్కడితో వెంకన్న అడ్డు తొలగి పోయింది. 

మరోవైపు.. నస్రీన్ కు అడ్డుగా ఉన్న రఫీని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. ఈ నెల 9న రఫీ మర్డర్ కు ముహుర్తం పెట్టారు నస్రీన్, వెంకన్న. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో రఫీ బయటకు వెళ్లగా.. నస్రీన్‌ తన ప్రియుడు వెంకన్నకు ఫోన్ చేసి.. సమాచారం అందించింది. ప్లాన్ ప్రకారం.. వెంకన్న తన మిత్రులైన మోతె మండలం సిరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారం గ్రామానికి చెందిన సారగండ్ల మధుతో కలిసి నస్రీన్ ఇంటికి వెళ్లారు.

వారిని ఆమె తన భర్తకు తెలియకుండా దాచిపెట్టింది. ఇంతలో బయటకు వెళ్లిన రఫీ ఇంటికి చేరుకున్నాడు. అనుకున్న విధంగా రఫీ పడుకోగానే వారంతా కలిసి దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసినట్టు సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడా దీశారు. 

ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే.. నస్రీన్ చేష్టాలు..ఆమె మాటలు రఫీ తమ్ముడు సుభాన్కు అనుమానం కల్గించారు. పైగా రఫీ శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో సుభాన్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నస్రీన్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా తీస్తే..అసలు కథ బయటపడింది. దీంతో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

click me!