ఎస్సారెస్పీడీ కెనాల్ లో పడిపోయిన ట్రాక్టర్.. డ్రైవర్ గల్లంతు..

Published : Jul 31, 2021, 11:08 AM IST
ఎస్సారెస్పీడీ కెనాల్ లో  పడిపోయిన ట్రాక్టర్.. డ్రైవర్ గల్లంతు..

సారాంశం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ శివారులో ఎస్సారెస్పీడీ 86 కెనాల్ లో ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో రామునిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గల్లంతయ్యాడు.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కెనాల్లో పడిపోయి డ్రైవర్ గల్లంతైన సంఘటన సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సుమారు రెండు గంటల పాటు పోలీసులు గాలింపు చేపట్టిన డ్రైవర్ ఆచూకీ తెలియలేదు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ శివారులో ఎస్సారెస్పీడీ 86 కెనాల్ లో ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో రామునిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గల్లంతయ్యాడు.

సమాచారం తెలిసిన వెంటనే సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సారెస్పీ అధికారులతో
మాట్లాడి చొప్పదండి వద్ద కెనాల్ వాటర్ ని బంద్ చేయించారు. శ్రీనివాస్ ఆచూకీ కోసం సుమారు రెండు గంటలుగా గాలింపు చేస్తున్నారు. 

శ్రీనివాస్ కి భార్య రజిత, అబ్బాయి అభిరామ్, అమ్మాయి మిన్ను ఉన్నారు. కెనాల్లో కొట్టుకుపోయాడా లేదా ప్రమాదం జరిగిన తర్వాత భయపడి ఎటైనా పారిపోయాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్ కనిపించకపోవడంతో పోలీసులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నీటిని ఆపి వేయడంతో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గింది. ఉదయం వరకు పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది.
 
PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ