మరోసారి హైకోర్టుకు రేవంత్...తమ ఆదేశాల అమలవడం లేదంటూ పిటిషన్

By Arun Kumar PFirst Published Nov 30, 2018, 1:55 PM IST
Highlights

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పటికే తనకు ప్రాణ హాని ఉందంటూ ఆరోపిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవాళ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన మరో రెండు రోజుల పాటు కూడా బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో తన భద్రత పెంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలవ్వడం లేదని...భద్రతను పెంచడం లేదంటూ ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 

గతంలో తనకు భద్రత పెంచాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం, పోలీస్ శాఖ అమలుచెయ్యడం లేదంటూ రేవంత్ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.  తన రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. రేవంత్ పిటిషన్ ను కాసేపట్లో కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ కింద డివిజన్ బెంచ్ విచారించినున్నట్లు సమాచారం.

రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తనకు ముప్పు ఉన్నందున 4 ప్లస్‌ 4 భద్రత కల్పించాలని గతంలోనే తాను హైకోర్టును ఆశ్రయించానని రేవంత్ గుర్తు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్  బెంచ్...కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం, కేంద్రాన్ని ఆదేశించిందని తెలిపారు. అయితే ఆ ఆదేశాలను అటు ప్రభుత్వం కానీ, ఈసీ కాని అమలు చేయ్యడం లేదని రేవంత్ వాపోయారు. అందువల్లే మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు 

బయటకు రాను: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తోంది: రేవంత్ రెడ్డి

ఆర్కేనగర్ లాగా కొడంగల్ ఎన్నిక వాయిదాకు కుట్రలు : రేవంత్

కొడంగల్ ఐటీ దాడులపై సీల్డ్ కవర్ నివేదిక...: రజత్ కుమార్

కొడంగల్ లో భారీ నగదు పట్టివేత...టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌస్‌లో...

click me!