బండి సంజయ్ కి ప్రాణహాని... జైల్లోనే చంపేందుకు కుట్ర..: న్యాయవాది మృత్యుంజయం సంచలనం (Video)

By Arun Kumar PFirst Published Jan 3, 2022, 5:03 PM IST
Highlights

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు ప్రాణహాని వుందని బిజెపి సీనియర్ నాయకులు, న్యాయవాది మృత్యుంజయం ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు పేర్కొన్నారు. 

కరీంనగర్: తెలంగాణ బిజెపి (telangana bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కు టీఆర్ఎస్ ప్రభుత్వం (trs government) నుండి ప్రాణహాని వుందంటూ బిజెపి సీనియర్ నాయకులు, న్యాయవాది కుటుకం మృత్యుంజయం సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం జ్యుడిషియర్ రిమాండ్ లో భాగంగా జైలుకు వెళుతున్న సంజయ్ ని అక్కడే హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. గత రాత్రి జాగరణ దీక్ష (jagaran deeksha)ను భగ్నం చేసి ఎక్కడికో తీసుకెళ్లిన పోలీసులు ఇవాళ(సోమవారం) ఉదయానికి గానీ తిరిగి కరీంనగర్ (karimnagar) కు తీసుకురాలేదు. ఏదో కుట్ర చేద్దామనే ఆలోచనతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మృత్యుంజయం అనుమానం వ్యక్తం చేశారు.

జైలులో అందించే ఆహారంలో విషం కలిపి సంజయ్ చేత తినిపించే ప్రమాదం పొంచివుందని బిజెపి నేత ఆందోళన వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు బండి సంజయ్ కు ఇలా ప్రాణహాని (ife threat) తలపెట్టవచ్చని అనుమానాలు వున్నాయన్నారు. కాబట్టి జైల్లో సంజయ్ కి ఆహారం ఇచ్చేటప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణ వుండేలా ఆదేశించాలని న్యాయమూర్తిని అభ్యర్థించినట్లు మృత్యుంజయం పేర్కొన్నారు. 

Video

ఇక జాగరణ దీక్షను ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు భగ్నం చేసారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కానీ పోలీసులు న్యాయస్థానం ముందు పచ్చి అబ్బద్దాలు ఆడారన్నారు. తాము ఎంపీ కార్యాలయంలోకి వెళ్లలేదని... గేటు బయటే వున్నామని పోలీసులు చెబుతున్నారు... మరి లోపలున్న బిజెపి నాయకులకు గాయలెలా అయ్యాయని ప్రశ్నించారు.

Video  కరీంనగర్ కోర్టుకు Bandi Sanjay... దారిపొడవునా భారీ బందోబస్తు, ఎలా తరలిస్తున్నారో చూడండి...  

మా పార్టీ అధ్యక్షులు సంజయ్ బెయిల్ కోసం మరోసారి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మృత్యుంజయం తెలిపారు. అలాగే సీనియర్ న్యాయవాదుల ద్వారా హైకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలిపారు.  హైకోర్టులో హౌస్ మోషన్ లేదా లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. 333సెక్షన్ ను తొలగించాలని స్క్వాష్ పిటిషన్ కూడా వేయనున్నట్లు కుటుకం మృత్యుంజయం వెల్లడించారు.

317 జీవో రద్దును చేయాలంటూ బండి సంజయ్ కరీంనగర్ లో ఆదివారం జాగరణ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధలకు విరుద్దంగా దీక్ష చేపడుతున్నారంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి శ్రేణులు, పోలీసులకు మధ్య యుద్ద వాతావరణం ఏర్పడింది. చివరకు తన కార్యాలయ గేట్లను మూసేసి సంజయ్ దీక్షకు సిద్దమవగా పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో ఆ గేట్ ను కట్ చేసిమరీ ఆయనను అరెస్ట్ చేసారు. 

read more  బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్.. కేసులకు భయపడొద్దని భరోసా..

ఇలా అరెస్ట్ చేసిన సంజయ్ రాత్రి మానుకొండూరు పోలీస్ స్టేషన్ లో వుంచిన పోలీసులు ఉదయం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకువచ్చారు. అయితే కరోనా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సంజయ్ తో మరికొందరు బిజెపి నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు పోలీసులు. కరీంనగర్ కోర్టులో ఆయనను హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు.

దీంతో కరీంనగర్ జిల్లా జైలుకు బండి సంజయ్ తో మరికొందరు బిజెపి నాయకులను పోలీసులు తరలించారు.  ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జైల్లోనే సంజయ్ చంపే ప్రమాదముందని బిజెపి నాయకుడు మృత్యుంజయం అనుమానం వ్యక్తం చేసారు. 


 

click me!