ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోసం: ఇంటర్ బోర్డు వద్ద జగ్గారెడ్డి దీక్ష

By narsimha lodeFirst Published Dec 23, 2021, 12:40 PM IST
Highlights

ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి  గురువారం నాడు దీక్షకు దిగారు.కనీస పాస్ మార్కులు వేసి విద్యార్ధులను పాస్ చేయాలని కూడా  విద్యార్ధులు ఆందోళన చేస్తున్న సమయంలో జగ్గారెడ్డి దీక్షకు దిగడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

హైదరాబాద్: ఫెయిలైన ఇంటర్ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూTpcc  వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy గురువారం నాడు దీక్షకు దిగారు. ఇవాళ ఇంటర్ బోర్డు ముందు దీక్ష చేశారు.  ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన దీక్ష చేస్తారు.ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్దతి గతంలో కూడా  ఉంది. ఈ పద్దతిని అనుసరించాలని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  ఈ ఏడాది అక్టోబర్ మాసంలో Inter First year పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో సుమారు 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 51 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.ఇంత తక్కువ శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం ఇదే ప్రథమంగా విద్యావేత్తలు చెప్పారు. అయితే ఇంటర్ విద్యార్థుల పరీక్షల విషయమై ఏం చేయాలనే దానిపై Telangana ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. 

 గ‌తేడాది కంటే ఈ ఏడాది ఏకంగా 11 శాతం ఉత్తీర్ణ‌త త‌గ్గింది. ప‌రీక్ష రాసిన విద్యార్థుల్లో స‌గం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. బాగా చ‌దివే విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థుల్లో చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌పైనే గ‌ట్టెక్కారు. ఈ సారి ఒక్క విద్యార్థి కూడా వంద శాతం మార్కులు సాధించ‌లేదు. ఎప్పుడూ టాప‌ర్లుగా నిలిచేవారు ఈ సారి బొటా బొటీ మార్కుల‌తో స‌రిపెట్టుకున్నారు. లాక్ డౌన్‌, ఆన్‌లైన్ క్లాసులు, సిల‌బ‌స్ పూర్తికాక‌పోవ‌డం ఇవ్వ‌న్నీ ఇంట‌ర్ ఫ‌లితాలు ఇలా రావ‌డానికి కార‌ణాలు. ఈ విష‌యం ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. తొలుత ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేసి ఆ తర్వాత ఆ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. అయితే పరీక్షల నిర్వహణ విషయమై విద్యార్ధులను సంసిద్దం చేయకపోవడం కూడా ఫలితాలు దారుణంగా రావడానికి కారణమనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.  దీంతో ఫెయిలైన విద్యార్ధులను పాస్ చేయాలనే డిమాండ్ తో విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులు ప్రతి రోజూ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు.

also read:Inter students suicides: తల్లిదండ్రులకు కడుపుకోత, బోర్డుపై భగ్గు

విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో సీఎం ఆఫీస్ రంగంలోకి దిగింది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, ఫ‌లితాలు విష‌యంలో ఇత‌ర రాష్ట్రాలు ఎలాంటి ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభించాయి. స‌మ‌స్యలు రాకుండా ఎలా ముందుకెళ్లారు. ఏం చేస్తే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చనే విష‌యంలో దృష్టి పెట్టింది. దాని కోసం అన్ని రాష్ట్రాల నుంచి నివేదిక‌లు తెప్పించుకుంటున్నాయి. న్యాయ స‌మ‌స్య‌లు రాకుండా, స్డూండెంట్ల‌కు భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలా ముందుకెళ్లాలి అని ఆలోచిస్తుంది. మరో వైపు ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం ఫెయిలైన విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను పాస్ చేయాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ గందరగోళాన్ని నివారించాలని ఆయన కోరారు.

click me!