బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై కోర్టుకెళ్లే యోచనలో కాంగ్రెస్.. న్యాయ నిపుణులతో చర్చలు

Siva Kodati |  
Published : Dec 29, 2022, 04:25 PM IST
బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై కోర్టుకెళ్లే యోచనలో కాంగ్రెస్.. న్యాయ నిపుణులతో చర్చలు

సారాంశం

బీఆర్ఎస్ లో చేరిన  12 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేయాలని సీబీఐని కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ విషయమై  సీబీఐకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే కోర్టుకెక్కాలని కూడా టీపీసీసీ భావిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వివిధ పార్టీల్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై కోర్టుకెళ్లనుంది టీపీసీసీ. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది టీపీసీసీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ 12 మంది మార్పుపై కూడా విచారణ చేయాలని కోరనుంది. 

కాగా.. 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన  ఎమ్మెల్యేల్లో  12 మంది  పార్టీని వీడి బీఆర్ఎస్ లో  చేరారు. అనంతరం బీఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనససభపక్షాన్ని  విలీనం చేస్తున్నట్టుగా  ప్రకటించారు.  బీఆర్ఎస్ లో  చేరిన తర్వాత  కొందరు ఎమ్మెల్యేలకు రాజకీయమైన పదవులు దక్కాయి. అంతేకాదు  ఆర్ధికంగా  ఏ రకమైన లబ్ది జరిగిందనే విషయాలను కూడా సీబీఐకి అందించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 2014-19 మధ్య కాలంలో కూడా టీడీపీ, కాంగ్రెస్  పార్టీలకు చెందిన  ఎంపీలు,ఎమ్మెల్యేలు  ఆ పార్టీని వీడి  బీఆర్ఎస్ లో  చేరిన సంగతి తెలిసిందే.  

ALso REad: బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ: సీబీఐని కోరనున్న రేవంత్ రెడ్డి

ఈ విషయమై  కోర్టుల్లో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా మొయినాబాద్  ఫాం హౌస్  కేసును  సీబీఐ విచారణకు ఆదేశిస్తూ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందున   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో  చేరిన విషయంలోనూ విచారణ చేయాలని  సీబీఐని కోరుతూ  వినతిపత్రం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  రెండ్రోజుల క్రితం ప్రకటించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో తమకు సంబంధం లేదంటూనే   సీబీఐ విచారణను బీజేపీ ఎందుకు కోరిందని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?