తెలంగాణ ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ డీజీపీ గా మహేందర్ రెడ్డి రిటైర్ కానున్న నేపథ్యంలో అంజనీకుమార్ ను నియమించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వలు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను ప్రభుత్వం నియమించింది. సీఐడీ చీఫ్ గా మహేష్ భగవత్ గా నియమించింది.ప్రస్తుతం ఆయన రాచకొండ సీపీగా ఉన్నారు.రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన నాటి మహేష్ భగవత్ సీపీగా కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మహేష్ భగవత్ ను బదిలీ చేయాలని కూడా ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఏసీబీ డీజీపీగా రవిగుప్తాను తెలంగాణ సర్కార్ నియమించింది. రాచకొండ సీపీగా డీఎస్ చౌహన్ ను నియమించింది ప్రభత్వం. శాంతిభద్రతల డీజీగా సంజయ్ కుమార్ జైన్ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్ లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
undefined
1990 బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ 2018 మార్చి 12న హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు.చాలాకాలం పాటు ఈ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి రిటైర్ కానుండడంతో ముగ్గురు ఐపీఎస్ పేర్లను యూపీఎస్ సీకి ప్రభుత్వం పంపింది. అంజనీకుమార్ తో పాటు 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా ,1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్ షరాఫ్ లు పేర్లు ప్రధానంగా విన్పించాయి. ఉమేష్ షరాఫ్ రిటైర్మెంట్ కు ఆరు మాసాలే సమయం ఉంది. రవిగుప్తా,అంజనీకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు ప్రభుత్వం అంజనీకుమార్ వైపే మొగ్గు చూపింది. తెలంగాణ డీజీపీగా ఉన్న అనురాగ్ శర్మ రిటైర్ కావడంతో మహేందర్ రెడ్డిని డీజీపీగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.1966 జనవరి 28న అంజనీకుమార్ జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమాల్ కాలేజీ, పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో అత్యుత్తమ హర్స్ రైడర్ గా అంజనీకుమార్ నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీజీపీ మహేందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రెండు వారాలు సెలవు పెట్టడంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ వ్యవహరించిన విషయం తెలిసిందే.