టార్గెట్ 90 సీట్లు: తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు పాలక్‌ లను నియమించిన బీజేపీ

By narsimha lodeFirst Published Dec 29, 2022, 3:32 PM IST
Highlights

తెలంగాణలోని  119 అసెంబ్లీ స్థానాలకు   పాలక్ లను  నియమించింది  బీజేపీ నాయకత్వం.  సీనియర్లను  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్ లుగా  ఆ పార్టీ నియమించింది. 

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో  90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  బీజేపీ  ముందుకు వెళ్లనుంది.  ఈ మేరకు  రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్ లను నియమించింది ఆ పార్టీ.  రెండు రోజుల పాటు బీజేపీ విస్తారక్ ల సమావేశం హైద్రాబాద్ లోని షామీర్ పేటలో  నిర్వహిస్తున్నారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుండి  విస్తారక్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో  90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  ఇవాళ  పార్టీ  సంస్థాగత ఇంచార్జీ  బీఎల్ సంతోష్  పార్టీ నేతలకు దిశా నిర్ధేశం  చేశారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో  పాటు  అసెంబ్లీ ఎన్నికల వరకు  ఏడాదిపాటు  కార్యక్రమాలను నిర్వహించే  విషయమై   ఈ సమావేశంలో  చర్చించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు  సీనియర్ నేతలను  పాలక్ లుగా  నియమించారు.

also read:తెలంగాణలో 90 అసెంబ్లీ స్థానాలు టార్గెట్: హైద్రాబాద్‌లో రెండు రోజులుగా బీజేపీ విస్తారక్‌ల భేటీ

 రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో   ఏయే అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయమై  పార్టీ నాయకత్వానికి స్పష్టత ఉంది.  ఏయే అసెంబ్లీ  నియోజకవర్గంలో  ప్రత్యర్ధులు  ఎవరు, ఆయా పార్టీల బలబలాలపై  కూడా  పార్టీ నాయకత్వం ఆరా తీస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో  ఇప్పటికిప్పుడు  ఎన్నికలు జరిగితే  పార్టీ  గెలిచే పరిస్థితులు  ఎలా ఉన్నాయనే విషయాలపై ఆరా తీస్తుంది. వీటి ఆధారంగా  వ్యూహలతో ముందుకు వెళ్లనుంది.  119 అసెంబ్లీ స్థానాల్లో  ఏడాది పాటు కార్యక్రమాల నిర్వహించనున్నారు. ఇతర పార్టీల నుండి బీజేపీలో  చేరే నేతల గురించి కూడా  రాష్ట్ర నేతలతో  బీఎల్ సంతోష్  చర్చించినట్టుగా సమాచారం. ఇతర పార్టీల నుండి  పార్టీలో చేరికల కోసం  ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

 రాష్ట్రంలో  పలు అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలుగా నియమితులైన  పార్టీ సీనియర్లు

కుత్బుల్లాపూర్ , డీకే అరుణ, ఎల్లారెడ్డికి రఘునందన్ రావు, రామగుండంకు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , బోధన్ కు ముల్కల మల్లారెడ్డి, నిజామాబాద్  అర్బన్  కు  బండ కార్తీక రెడ్డి, నిజామాబాద్ రూరల్ కు  గీతా మాూర్తి, ధర్మపురికి బాబుమోహన్, ఆంథోల్ కు తుల ఉమ, మల్కాజిగిరికి ఎన్ వీ సుభాష్, పరిగికి విజయశాంతి, కంటోన్మెంట్ కు  నల్లు ఇంద్రసేనారెడ్డి, కల్వకుర్తికి  మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు లను నియమించారు.


 

click me!