Revanth Reddy: "కేసీఆర్‌ ఓటమి ఖాయం.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు తధ్యం"

By Rajesh Karampoori  |  First Published Dec 1, 2023, 2:40 AM IST

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అయితే.. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప మిగిత ఎగ్జిట్ పోల్స్‌ అన్ని  కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 


Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అయితే.. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప మిగిత ఎగ్జిట్ పోల్స్‌ అన్ని  కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందనే అంచన వేశాయి. ఈ నేపథ్యం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు నేటీ నుంచి సంబరాలు చేసుకోవచ్చని  తెలిపారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్ముతున్నారనీ, ఎగ్జిట్ పోల్స్  అన్ని కాంగ్రెస్ కే పట్టం కడితే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. 

ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న క్షమాపణ చెప్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు ప్రజలంటే చిన్నచూపు అని, ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని, కేసీఆర్ తాను ఓడిపోతానని తెలిసి నియోజకవర్గం మారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 25కి మించి ఒక్క సీటు కూడా పెరగదని, కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని  అన్నారు. ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని, పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని  హామీ ఇచ్చారు. 

Latest Videos

undefined

ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా రాలేదని, కామారెడ్డిలో ప్రజలు కేసీఆర్‌ను ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని  మెచ్చుకున్నారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక సంబంధం ఉందని, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడబోతున్నాయని అన్నారు. ప్రాణ త్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడని, శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పిస్తున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . 

తాము పాలకులుగా కాకుండా సేవకులుగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్లబోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని విమర్శించారు.  అధిష్ఠానం సూచన మేరకు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.  
 

click me!