Telangana polling : ఆక్సీజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి.. యువతకు ఆదర్శం ఈ పెద్దాయన...

By SumaBala BukkaFirst Published Nov 30, 2023, 1:59 PM IST
Highlights

తన అనారోగ్యం తన హక్కును వాడుకోవడానికి అడ్డంకి కాదనుకున్నారు.  తన ఓటు మరెవరో దొంగ ఓటుగా వేయడానికి అవకాశం ఇవ్వద్దు అనుకున్నారాయన.

హైదరాబాద్ : ఓటు వేయడం రాజ్యాంగం పౌరుడికి ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఈ హక్కును చదువుకున్న వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారు తెలియదు కానీ..  చదువుకోనివారు మాత్రం ఓటింగ్ లోఎక్కువ శాతం పాల్గొంటుంటారు. దీనికి నిదర్శనం హైదరాబాదులో నమోదవుతున్న పోలింగ్ శాతమే. జిల్లాలో మారుమూల గ్రామాల్లో నమోదవుతున్న పోలింగే. ఒక పౌరుడిగా తన హక్కును వినియోగించుకోవడానికి అనారోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు ఓ వ్యక్తి.  ఆక్సిజన్ సిలిండర్తో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

తెలంగాణలో గురువారం ఉదయం ఏడు గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.హైదరాబాదులో తక్కువ పోలింగ్ నమోదవుతున్నప్పటికీ ఓ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాదులోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి.. లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే తన అనారోగ్యం తన హక్కును వాడుకోవడానికి అడ్డంకి కాదనుకున్నారు.  తన ఓటు మరెవరో దొంగ ఓటుగా వేయడానికి అవకాశం ఇవ్వద్దు అనుకున్నాడు.

Latest Videos

ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తోనే ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జిపిఆర్ఏ క్వార్టర్స్ పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఆయనను చూసిన చాలామంది  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.  

click me!