టార్గెట్ 2019: ఉత్తర తెలంగాణలో సోనియా టూర్

By narsimha lodeFirst Published Aug 21, 2018, 5:36 PM IST
Highlights

సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 30వ తేదీ వరకు  తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్:  సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 30వ తేదీ వరకు  తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగేలా ఆ పార్టీ ప్లాన్ చేసింది.

తెలంగాణలో బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆ యాత్రల ద్వారా ప్రజలకు వివరించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. 

ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీ  కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్రను నిర్వహించింది.  అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వతేదీవరకు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ప్రతి రోజూ  రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగేలా రూట్ మ్యాప్‌ను తయారు చేస్తున్నారు.  ఈ బస్సు యాత్ర నిర్వహణకు సంబంధించి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సబ్ కమిటీకి శాసనమండలిలో విపక్షనాయకుడు షబ్బీర్ అలీ  ఛైర్మెన్ గా నియమించారు.  ఈ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు. 9 మంది కమిటీ సభ్యులు  యాత్ర విజయవంతమయ్యేలా  ప్లాన్ చేయనున్నారు.

తెలంగాణలో బస్సు యాత్ర సందర్భంగా రాహుల్ పాల్గొనేలా చేయాలని తొలుత ప్లాన్ చేశారు. ఆగష్టు 13,14 తేదీల్లో రాహుల్ హైద్రాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ టూర్ సందర్భంగా  బస్సు యాత్రలో పాల్గొనేలా తొలుత ప్లాన్ చేసినా అది సాధ్యం కాలేదు.

మరోవైపు  సెప్టెంబర్ లో జరిగే బస్సు యాత్రలో  సోనియాగాంధీ పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్ర ఉత్తర తెలంగాణలో సాగే సమయంలో సోనియాగాంధీతో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. 

 అయితే ఏ రోజున, ఎక్కడ సోనియాగాంధీ సభను నిర్వహించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాహుల్ గాంధీ , సోనియాగాంధీలతో తెలంగాణలో ఎక్కు సభలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.


 

click me!