దళిత బంధుపై కేసీఆర్ సమీక్ష.. కాంగ్రెస్ తరపున హాజరుకానున్న భట్టి, టీపీసీసీ అనుమతి

By Siva KodatiFirst Published Sep 12, 2021, 8:20 PM IST
Highlights

దళిత బంధు సమీక్షపై పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుని వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభిప్రాయాలను పంచుకున్నారు. దళిత బంధుపై మనమే సభలు నిర్వహిస్తూ సమావేశానికి వెళ్లకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతామని చర్చ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న దళిత బంధు సమీక్షా సమావేశానికి హాజరవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్‌ను సీఎం ముందు వినిపించాలని తీర్మానించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ నేత భట్టి, పార్టీ ముఖ్యనేతల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి దళిత బంధు అమలుకు ఎంపిక చేసిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

మధిర నియోజకవర్గంలో కూడా దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. అక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా వున్నారు. సీఎం సమీక్షా సమావేశానికి భట్టి వెళ్లాలా వద్దా అన్న దానిపై టీపీసీసీ సమావేశంలో చర్చించారు. దళిత బంధును ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే అనే డిమాండ్‌ను సీఎం ముందు వుంచాలని సీఎల్పీ నేత భట్టికి సూచించింది కాంగ్రెస్ పార్టీ. 

గతంలో మరియమ్మ ఎపిసోడ్‌లో కూడా పార్టీ ఎమ్మెల్యేలు .. పార్టీతో చర్చించకుండా సీఎంను కలిశారు. దీంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ అనుమతి లేకుండా సీఎల్పీ నేత ఆ సమావేశానికి ఎలా వెళ్తారంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో దళిత బంధు సమీక్షపై పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుని వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభిప్రాయాలను పంచుకున్నారు. దళిత బంధుపై మనమే సభలు నిర్వహిస్తూ సమావేశానికి వెళ్లకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతామని చర్చ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు

click me!