కేపీహెచ్‌బీలో డాక్టర్ ఆత్మహత్య.. మెదక్ కారు డిక్కీలో డెడ్‌బాడీ కేసులో మృతుడిపై ఆరోపణలు

By Siva KodatiFirst Published Sep 12, 2021, 5:52 PM IST
Highlights

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. చంద్రశేఖర్ అనే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హోటల్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మెదక్  పట్టణంలో చంద్రశేఖర్ చిన్న పిల్లల వైద్యుడిగా కొనసాగుతున్నారు

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. చంద్రశేఖర్ అనే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హోటల్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మెదక్  పట్టణంలో చంద్రశేఖర్ చిన్న పిల్లల వైద్యుడిగా కొనసాగుతున్నారు. నిజాంపేటలో కుమారుడికి నీట్ పరీక్ష వుండటంతో అతనికి తోడుగా హైదరాబాద్ వచ్చారు చంద్రశేఖర్ దంపతులు. అయితే  భార్యను ఇంటికి పంపించేసి హోటల్‌లో ఆత్మహత్యకు చేసుకున్నారు చంద్రశేఖర్. ఇటీవల సంచలనం సృష్టించిన మెదక్ కారు డిక్కీలో డెడ్ బాడీ కాల్చివేత కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారావేత్త ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

కాగా, మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తి వద్ద హోండాసిటీ కారులో డెడ్‌బాడీ సహా మృతదేహం దగ్ధమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది రియల్ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు.కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్ రియల్ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్వగ్రామం నుండి ఆయన  హైద్రాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు.

Also Read:మెదక్‌ కారులో డెడ్‌బాడీ మిస్టరీ చేధించిన పోలీసులు: ముగ్గురి అరెస్ట్

శ్రీనివాస్ ను హత్య చేసి అదే కారులో ఆయన డెడ్‌బాడీతో కలిపి కారును దగ్ధం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీలే ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు.వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుండి కోటి రూపాయాలు,. హైద్రాబాద్ లో మరో రూ. 50 లక్షలు రావాల్సి ఉందని ధర్మకారి శ్రీనివాస్ బంధువులు చెప్పారు.

click me!