రాహుల్‌తో టీ.పీసీసీ నేతల భేటీ.. అభ్యర్థుల ఎంపికకు కమిటీ

Published : Sep 14, 2018, 01:31 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
రాహుల్‌తో టీ.పీసీసీ నేతల భేటీ.. అభ్యర్థుల ఎంపికకు కమిటీ

సారాంశం

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ నేతల సమావేశం ముగిసింది. తెలంగాణ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై భేటీలో చర్చించారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ నేతల సమావేశం ముగిసింది. తెలంగాణ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల కోసం ముగ్గురు సభ్యుల కమిటీని రాహుల్ నియమించారు.

ఈ కమిటీ ఛైర్మన్‌గా భక్తచరణ్ దాస్ ఛైర్మన్‌గా... జ్యోతిమణి, శర్మిష్టా ముఖర్జీ సభ్యులుగా ఉంటారు. సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఎంపికపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టిపెట్టనుంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ కూడా అభ్యర్థుల ఎంపికపై జిల్లాల వారీగా కమిటీలను నియమించింది.

ఈ కమిటీలు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా త్రిసభ్య కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పోటీలేని.. వివాదాస్పదం కానీ నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌