చంద్రబాబుపై లాఠీ ఎత్తారు.. శవాల వ్యానులో మమ్మల్ని ఎక్కించారు: నామా

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 1:05 PM IST
Highlights

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై టీటీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై టీటీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, గరికపాటి తదితర నేతలు మీడియాతో మాట్లాడారు. నాడు బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ఏడారిగా మారుతుందని అలా కాకూడదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయకత్వంలో తమంతా బాబ్లీ సందర్శనకు వెళ్లామన్నారు నామా.

తామంతా ఇంకా తెలంగాణ సరిహద్దులో ఉండగానే వేలాది మంది మరాఠా పోలీసులు 80 మంది టీడీపీ నేతలను వ్యానులోకి ఎక్కించారన్నారు. డ్యామ్ వద్దకు తమ వాహనాలకు అనుమతి లేదేమోనని.. పోలీసు వాహనంలో అక్కడికి తీసుకువెళతారేమోనని తాము భావించామని.. కానీ చంద్రబాబుతో సహా నేతలందరినీ ఊరి చివర కాలేజీలో చిన్న హాల్‌లో నిర్భంధించారని నామా అన్నారు.

ఆ హాలులోనే 80మంది ఆ రాత్రి నరకయాతన అనుభవించామని.. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు ఇబ్బందులు పెట్టారని నామా తెలిపారు. తరువాతి రోజు తమను వ్యానుల్లో మరోచోటికి తరలించేందుకు పోలీసులు వచ్చారని.. శవాలను, దొంగలను తరలించే వాహనాల్లో మహిళా ఎమ్మెల్యేలను ఎక్కిస్తుంటే.. వారి బాధను చూడలేక చంద్రబాబు కంటతడి పెట్టారని.. ఆయనపైనే లాఠీ ఎత్తారని నామా గుర్తు చేసుకున్నారు.

కానీ తెలంగాణ సంక్షేమం కోసం తామంతా ఆ బాధల్ని భరించామని నాగేశ్వరరావు అన్నారు. ఒక రోజు రాత్రి తమందరిని ఔరంగాబాద్ విమానాశ్రయానికి తరలించి.. విమానంలో బలవంతంగా హైదరాబాద్ తరలించారని చెప్పారు. జరిగిన సంగతిని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లానని.. సభను స్తంభింపజేసి తెలంగాణకు న్యాయం చేయాలని కోరామని నామా అన్నారు.

నాడు తమను విమానం ఎక్కించే సందర్భంలో మహారాష్ట్ర మంత్రులు, డీజీపీలు మీ మీద ఎలాంటి కేసులు లేవని చెప్పారని.. కానీ తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టించి.. అరెస్ట్ వారెంటులు జారీ చేశారని నామా విమర్శించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుని.. తెలుగుజాతికి, చంద్రబాబుకి క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయించిన ఘనత బీజేపీదేనని నామా ఎద్దేవా చేశారు.

శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. ఆపరేషన్ గరుడలో భాగమే: బుద్దా

చంద్రబాబుకు నోటీసు: భగ్గుమన్న ఎపీ టీడీపి నేతలు

 

click me!