కాక రేపుతున్న టీపీసీసీ.. రేవంత్ టార్గెట్ గా అధిష్టానానికి హెచ్చరిక లేఖ..

By AN TeluguFirst Published Dec 16, 2020, 2:06 PM IST
Highlights

టీపీసీసీ పదవి కాంగ్రెస్ లో కాక రేపుతోంది. ఏ వర్గానికి పదవి వరిస్తుందోనని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది.

టీపీసీసీ పదవి కాంగ్రెస్ లో కాక రేపుతోంది. ఏ వర్గానికి పదవి వరిస్తుందోనని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది.

రేవంత్ వర్గం, రేవంత్ అపోజిట్ వర్గం అని రెండు వర్గాల మధ్యే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఫైట్ సాగుతోంది. పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్న వారని వదిలేసి రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే ఊరుకోం అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు. రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇస్తే కొందరు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతారని హెచ్చరిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతల పేరుతో ఓ లేఖ సోనియా గాంధీకి రాశారు. 

అందులో ఎవరి పేరు కూడా పెట్టలేదు. రేవంత్ టార్గెట్‌గా ఈ లేఖ రాయబడింది. రేవంత్ ఆర్ఎస్ఎస్ వ్యక్తిని.. అలాంటి వారితో బీజేపీని ఎలా ఢీ కొడతామని ప్రశ్నించారు. బీజేపీ రేవంత్‌పై సీబీఐ కేసు పెట్టాలని చూస్తోందని ఆ లేఖలో రాశారు. 

తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, మనం కూడా ఓ బీసీ నేతను టీపీసీసీ నేతగా నియమిద్దామని ఆ లేఖలో సూచించారు.

లాయలిస్టుల పేరుతో రాసిన ఈ లేఖ ఎవరు రాశారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అతను కొడంగల్ లో ఓడిపోయాడు, దుబ్బాకలో గెలిపించలేకపోయాడు అలాంటిది రేవంత్ రెడ్డిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 

click me!