టీఆర్ఎస్ వేగంగా పతనమౌతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 28, 2021, 4:52 PM IST
Highlights

టీఆర్ఎస్ వేగంగా పతనం అవుతోందని టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికలలో బీజేపీకి 105 నియోజక వర్గాలలో కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్ వేగంగా పతనం అవుతోందని టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికలలో బీజేపీకి 105 నియోజక వర్గాలలో కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. 

బీజేపీ ఒక నీటి బుడగలాంటిదన్నారు. కాంగ్రెస్‌కు ప్రతి గ్రామంలో ప్రతి మునిసిపాలిటీలో కార్యకర్తల బలం ఉందన్నారు. కాంగ్రెస్‌కు అనుబంధ సంఘాలు సంపదగా ఆయన పేర్కొన్నారు.

 దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది,  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని ఆయన గుర్తు చేశారు.. కొంత మంది స్వార్థపరులు, పార్టీలో అన్ని అనుభవించి ఇప్పుడు పార్టీని తిడుతున్నారని ఆయన మండిపడ్డారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ, టిఆర్ఎస్‌లు అమలు చేయలేకపోయాయని ఉత్తమ్ విమర్శించారు. ఈ దద్దమ్మలు ఐటీఐర్ ఇవ్వకపోవడం వల్ల లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయన్నారు. 

అయోధ్య గురించి మాట్లాడే బీజేపీ వాళ్ళు తెలంగాణలోని భద్రాద్రి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మైనార్టీల పట్ల బీజేపీ దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే పుట్టినట్టు ఉందన్నారు.
 

click me!