ఓయూలో చర్చకు రా...: మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్సీ రామచందర్ రావు సవాల్

By narsimha lodeFirst Published Feb 28, 2021, 4:08 PM IST
Highlights

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో తేల్చుకొనేందుకు ఓయూలో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ది రామచందర్ రావు మంత్రి కేటీఆర్ ను కోరారు.

హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో తేల్చుకొనేందుకు ఓయూలో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ది రామచందర్ రావు మంత్రి కేటీఆర్ ను కోరారు.

ఆదివారం నాడు ఆయన మంత్రి కేటీఆర్ రాశారు.ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో  మంత్రి కేటీఆర్ కు ఆయన లేఖ రాశారు. తనపై కేటీఆర్ దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.

లాయర్లకు వందకోట్లు ఇప్పించినట్టుగా చెప్పారు ఇల్ల స్థలాలు వచ్చేలా చేసింది తానేనని ఆయన గుర్తు చేశారు. న్యాయవాదులకు రాంచందర్ రావు ఏం చేసారో లాయర్లకు తెలుసునన్నారు. 

ఐటీఐఆర్ విషయంలో మీ అబద్ధం పార్లమెంట్ సాక్షి గా బట్టబయలు అయ్యాయన్నారు. రహదారులపై,ఏయిమ్స్ పై కేంద్రం తో మాట్లాడానని ఆయన చెప్పారు. 
మీ తప్పిదంతోనే రాష్ట్రం ఐటీఐఆర్ కొల్పోయిందని ఆయన టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ఎంఎంటీఎస్ నిదులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సీపీఎం క్యాండిడేట్ ను గెలిపించేందుకే పీవీ కుటుంభం సభ్యురాలిని బయటకు తీసుకుని వచ్చారని ఆయన ఆరోపించారు.  గట్టు వామనరావు హత్యతో మీకు భ్రాహ్మణ ఓట్లు పడవనే పీవీ కూతురు కు టికెట్ ఇచ్చారన్నారు.
ఒక్క బ్రహ్మణ వర్గమే కాకుండా అన్నివర్గాలు తన వెంటే ఉన్నాయన్నారు. 
 

click me!