రేపటి నుండి తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ: మెడికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు

By narsimha lodeFirst Published Feb 28, 2021, 3:16 PM IST
Highlights

మార్చి 1వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.
 

హైదరాబాద్: మార్చి 1వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

ఆదివారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే వారు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. 

45 ఏళ్ల నుండి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్టుగా ఆయన తెలిపారు.రాష్ట్రంలోని 102 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్  కేంద్రంలో టీకా తీసుకోవచ్చన్నారు.

ప్రతి జిల్లాలో రెండు, హైద్రాబాద్ లోని 12 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు.దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందన్నారు.ప్రైవేట్ లో 215 ఆసుపత్రులకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు అనుమతి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 

click me!