కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఉత్తమ్ డిమాండ్

By narsimha lodeFirst Published May 14, 2021, 11:44 AM IST
Highlights

కరోనా రోగులకు ఉచితంగా వైద్య చికిత్స అందించని కారణంగా సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి  డిమాండ్ చేశారు. 

హైదరాబాద్: కరోనా రోగులకు ఉచితంగా వైద్య చికిత్స అందించని కారణంగా సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి  డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని  ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని జనాభాకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినా రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ పరికరాల ఏర్పాటుకు రూ. 6.60 కోట్ల కంటే ఎక్కువ కాదని ఆయన చెప్పారు. 

కరోనా సోకిన తనకు చికిత్స కోసం రూ. 3 లక్షలు ఖర్చు అయిందని ఆయన  గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్య  రంగంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చాలని తాను గత ఏడాదే కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కానీ ఇంతవరకు ప్రభుత్వం ఈ విషయమై ఎందుకు దృష్టి పెట్టలేదో చెప్పాలన్నారు. కరోనా చికిత్సను ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని  ఆయన ప్రశ్నించారు. 

click me!