కేసీఆర్‌ టైం స్టార్టయ్యింది.. తెలంగాణలో బీజేపీ గెలుపు గాలివాటమే: ఉత్తమ్

By Siva KodatiFirst Published May 28, 2019, 11:51 AM IST
Highlights

టీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ కార్యకర్తలు సన్మానం చేశారు.

టీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ కార్యకర్తలు సన్మానం చేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేలా కేసీఆర్ వ్యవహరించారని ఉత్తమ్ మండిపడ్డారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు మరో రెండు స్థానాల్లో చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ డబ్బు, మద్యాన్ని ప్రవహింపజేసినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు.

2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఉత్తమ్ విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఖాజీపేట రైల్వే డివిజన్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఆఆర్‌ల కోసం తెలంగాణ ప్రజల తరపున పార్లమెంటులో పోరాడుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దించేది కాంగ్రెస్సేనని.. ఏదో గాలివాటంగా బీజేపీ గెలిచిందని ఆయన తెలిపారు. 

click me!