సుప్రీంను ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

By telugu teamFirst Published May 28, 2019, 11:39 AM IST
Highlights

తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది.

హైదరాబాద్: టీవీ9 న్యూస్ చానెల్ కొత్త యాజమాన్యం పెట్టిన కేసుల్లో ఆ చానెల్ మాజీ సీఈవో రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది.

రవిప్రకాష్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్‌ స్పందించలేదు. ఇప్పటికే సైబర్‌ క్రైం పోలీసులు రవిప్రకాష్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్‌తో పాటు సినీ నటుడు, గరుడ శివాజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో ప్రత్యేకబృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రవిప్రకాష్‌ ఫోర్జ‌రీ, డేటా చోరీ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్ష‌న్ 160 ప్ర‌కారం ఈ నెల 9, 11వ తేదీల్లో సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినా రవిప్రకాష్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!