ఉత్తమ్ మరో సవాల్: అప్పుడు గెడ్డం తీయనని, ఇప్పుడు ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ ఛాలెంజ్

By Nagaraju penumalaFirst Published Sep 30, 2019, 9:12 PM IST
Highlights

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన భార్య పద్మావతి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 30వేల మెజారిటీతో పద్మావతి గెలవకపోతే తాను ఏ శిక్షకైనా శిద్ధమేనంటూ సవాల్ విసిరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 
 

హుజూర్ నగర్: తెలంగాణ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే గెడ్డం తీయనని సవాల్ విసిరిన ఆయన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ మరో సవాల్ విసిరారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన భార్య పద్మావతి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 30వేల మెజారిటీతో పద్మావతి గెలవకపోతే తాను ఏ శిక్షకైనా శిద్ధమేనంటూ సవాల్ విసిరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనివార్య కారణాల వల్లే తాను ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. తనను తన కుటుంబాన్ని ఇంతలా ఆదరిస్తున్న హుజూర్ నగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. 

హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధి తప్ప ఇంకెవరైనా చేశారా అని ప్రశ్నించారు. తాను నిస్వార్థంగా ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కేటీఆర్ లా అమెరికా నుంచి రాలేదన్నారు. తండ్రి కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల అండదండలతో ప్రజల ఆశీస్సులతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. 

ఇకపోతే సవాల్ విసరడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయనే సాటి. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే గెడ్డం తీయనంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ విసిరారు. తాజాగా ఉత్తమ్ పద్మావతి 30 వేల మెజారిటీతో గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ మరో సవాల్ విసిరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీఆర్ఎస్ వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి, ఇవ్వకపోతే ధర్నా చేయండి: ఎంపీ కోమటిరెడ్డి

click me!