నాపై గుడ్లు, టమోటాలు వేయిస్తావా.. నేను తలచుకుంటే నీ ఇల్లు, థియేటర్ వుండవు : గండ్రకు రేవంత్ వార్నింగ్

Siva Kodati |  
Published : Feb 28, 2023, 09:19 PM ISTUpdated : Feb 28, 2023, 09:29 PM IST
నాపై గుడ్లు, టమోటాలు వేయిస్తావా.. నేను తలచుకుంటే నీ ఇల్లు, థియేటర్ వుండవు : గండ్రకు రేవంత్ వార్నింగ్

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు, నీ ధియేటర్ వుండవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.   

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు, టమోటాలతో దాడికి పాల్పడ్డారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం ఆయన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయనపై దుండగులు కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు ఉదయం భూపాలపల్లిలో  రేవంత్ రెడ్డి విద్యార్ధులతో  సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే  అన్ని విద్యా సంస్థల్లో  రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్  అమలయ్యేలా పాలసీని రూపొందించనున్నట్టుగా ఆయన తెలిపారు. కేంద్రంలో  యూపీఏ ప్రభుత్వం అధికారంలో  ఉన్న సమయంలో  రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు. కేసీఆర్ సర్కార్  ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో  కూడా ఈ చట్టం ద్వారా  పేదలకు  25 శాతం  సీట్లను ఉచితంగా కేటాయించాలని  చట్టం చెబుతుందన్నారు. తమ ప్రభుత్వం  ఈ చట్టం అమలయ్యేలా పాలసీని రూపొందించనుందని రేవంత్ రెడ్డి  తెలిపారు. విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్  పథకాన్ని  కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన విషయాన్ని  రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు.  

ALso REad: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో  నమోదైన  కేసులను  ఎత్తివేస్తామని  రేవంత్  రెడ్డి  స్పష్టం  చేశారు. విద్యపై  ప్రభుత్వం చేసే ఖర్చు పెట్టుబడి అని  .. విద్యకు  10 శాతం నిధులను  ఖర్చు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. హస్టళ్లలో కూడా  సౌకర్యాలను కూడా మెరుగుపర్చేలా  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించనుందని  రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై బిశ్వాల్ కమిటీని  కేసీఆర్  ప్రభుత్వం నియమించిందన్నారు. 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని  కమిటీ  చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగులుంటే  ఇందులో  రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని  రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్  వయస్సును పెంచి  కొత్త ఉద్యోగాల ప్రకటన రాకుండా  కేసీఆర్ సర్కార్ చేసిందని  రేవంత్ విమర్శించారు.  
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu