గండ్రకు ఇదే చివరి పదవి.. తర్వాత రాజకీయ సమాధే: భూపాలపల్లిలో రేవంత్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 30, 2021, 08:49 PM IST
గండ్రకు ఇదే చివరి పదవి.. తర్వాత రాజకీయ సమాధే: భూపాలపల్లిలో రేవంత్ వ్యాఖ్యలు

సారాంశం

ఇసుక, బొగ్గు, భూములను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కబ్జా చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన జీవితానికి ఇదే చివరి పదవని రేవంత్ ఎద్దేవా చేశారు. కష్టపడి గెలిపిస్తే.. తమను నమ్మించి టీఆర్ఎస్‌లో చేరారంటూ గండ్ర వెంకట రమణారెడ్డిపై విమర్శలు చేశారు రేవంత్.   

కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూపాల్‌పల్లిలో గురువారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ... ఈ జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని కానీ ఇక్కడ కనీసం బైపాస్ రోడ్ వేయలేదని, కలెక్టర్ కార్యాలయం కట్టాలని గుర్తుచేశారు. ఇంత జరుగుతుంటే పార్టీ ఫిరాయించిన గండ్ర వెంకట రమణారెడ్డి ఎక్కడున్నారని రేవంత్ మండిపడ్డారు. ఇసుక, బొగ్గు, భూములను గండ్ర కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన జీవితానికి ఇదే చివరి పదవని రేవంత్ ఎద్దేవా చేశారు. కష్టపడి గెలిపిస్తే.. తమను నమ్మించి టీఆర్ఎస్‌లో చేరారంటూ గండ్ర వెంకట రమణారెడ్డిపై విమర్శలు చేశారు రేవంత్. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు