కట్లు కట్టుకుని డ్రామాలకు సిద్ధం.. అచ్చం రఘునందన్ దారిలోనే, స్కెచ్ రెడీ: ఈటలపై కొప్పుల సంచలనం

Siva Kodati |  
Published : Sep 30, 2021, 08:29 PM ISTUpdated : Sep 30, 2021, 08:34 PM IST
కట్లు కట్టుకుని డ్రామాలకు సిద్ధం.. అచ్చం రఘునందన్ దారిలోనే, స్కెచ్ రెడీ: ఈటలపై కొప్పుల సంచలనం

సారాంశం

బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 12,13,14న దాడి జరిగినట్లు సృష్టించి .. కాళ్లకు, చేతులకు ఈటల కట్లు కట్టుకుంటారని కొప్పుల ఆరోపించారు. 

బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 12,13,14న దాడి జరిగినట్లు సృష్టించి .. కాళ్లకు, చేతులకు ఈటల కట్లు కట్టుకుంటారని కొప్పుల ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు కట్టు కట్టుకుని సింపతి క్రియేట్ చేశారని .. ఈటల కూడా అదే ఫాలోకాబోతున్నారని మంత్రి ఆరోపించారు. బీజేపీ అంటేనే కుట్రపూరిత పార్టీ అని విమర్శలు గుప్పించారు కొప్పుల. దీనిపై తనకు అత్యంత కీలకమైన సమాచారం అందిందన్నారు. 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ