కేసీఆర్ నాటకాల వెనుక పీకే వ్యూహాలు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 13, 2022, 08:07 PM IST
కేసీఆర్ నాటకాల వెనుక పీకే వ్యూహాలు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో భాగంగానే సీఎం నాటకాలు వేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 

కేసీఆర్ (kcr) సీఎం అయ్యి ఎనిమిదేళ్లు అయ్యింది.. పాలమూరు మారిందా అని ప్రశ్నించారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). ఆదివారం కొల్లాపూర్‌లో (kollapur) జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చుతానని అన్నారని.. ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ  చేస్తామని.. ప్రశాంత్ కిషోర్ (prashant kishor) వ్యూహాల్లో భాగంగానే కేసీఆర్ నాటకాలంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. 

మరోవైపు.. Tollywood  Drugs కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని Revanth Reddy ఆరోపించారు. శుక్రవారం నాడు Enforcement Directorate  కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ఇవ్వాలని హైకోర్టు Excise శాఖను ఆదేశించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ ఈడీకి ఈ సమాచారాన్ని ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై సమాచారం ఇవ్వకపోతే తమకు చెప్పాలని కూడా ఈడీకి High Court సూచించిందన్నారు. ఎక్సైజ్ శాఖ నుండి సమాచారం ఇవ్వకపోయినా కూడా ఈడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని ఈడీతో పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

2017లో డ్రగ్స్ కేసులో 12 FIR లు హడావుడిగా నమోదు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.అప్పట్లో ఈ కేసును విచారణ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో Gutka లేదు, మట్కా లేదని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.కానీ, గల్లీ గల్లీలో గంజాయి, గుట్కా గుప్పు మంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకండా చేసేందుకు వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తుననామని సీఎం కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి  ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదంతా చూసిన తాను సీఎం కేసీఆర్ మారాడని భావించానన్నారు. కానీ సీఎం కేసీఆర్ లో మార్పు రాలేదని టాలీవుడ్ డ్రగ్స్ కేసును చూస్తే అర్ధమౌతుందన్నారు.  హైద్రాబాద్ లో కొత్తగా 90 PUBలకు అనుమతులు ఇచ్చారన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?