హైదరాబాద్: బాలుడి తలను నోటకరచుకొచ్చిన కుక్క.. ఎల్‌బీ నగర్‌లో కలకలం, రంగంలోకి పోలీసులు

Siva Kodati |  
Published : Mar 13, 2022, 05:25 PM ISTUpdated : Mar 13, 2022, 05:29 PM IST
హైదరాబాద్:  బాలుడి తలను నోటకరచుకొచ్చిన కుక్క.. ఎల్‌బీ నగర్‌లో కలకలం, రంగంలోకి పోలీసులు

సారాంశం

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఓ కుక్క బాలుడి తలను  నోటకరచుకుని రావడం కలకలం రేగింది. బాలుడి వయసు పదేళ్లు వుంటుందని అంచనా. రంగంలోకి దిగిన పోలీసులు... క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. 

హైదరాబాద్ (hyderabad) ఎల్బీ నగర్‌లో (lb nagar) దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడి (boy head) తల కనిపించడంతో కలకలం రేగింది. ఎల్బీనగర్‌ పరిధిలోని మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం గమనించారు స్థానికులు. వెంటనే కుక్కను వెంబడించగా... బాలుడి తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి కుక్క పారిపోయింది. 

దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంను  కూడా రంగంలోకి దింపారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ఆ బాలుడు ఎవరు..? ఎవరైనా హత్య చేశారా..? లేక ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు  ఆరా తీస్తున్నారు. మృతుడి వయసు పదేళ్లు వుంటుందని భావిస్తున్నారు. బాలుడి తలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?